యూపీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కుషినగర్ జిల్లా కాప్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవరి కృత్‌పురా గ్రామంలో గోధుమ గడ్డిని ఓ ట్రాక్టర్‌లో లోడ్ చేస్తున్న క్రమంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే కిందకు దూకేశాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.