చిన్న హోటల్ నుంచి మొదలుకొని రెస్టారెంట్ల వరకు ఆహారం కల్తీ జరుగుతుంది. వంటల్లో నాణ్యమైనా మంచినూనె వాడడం లేదు. కొన్నిసార్లు వాడిన నూనెను పదేపదే వాడడంతో విష పదార్థాలు తయారవుతున్నాయి. తాజా కూరగాయలతో వంటలు చేయకపోవడం, క్షేత్ర స్థాయిలో నాసిరకం పదార్థాలు విక్రయిస్తున్నా.. పరిశీలించాల్సిన అధికారులు కానరావడంలేదు. మార్కెట్లో పలు రకాల అప్పాలు, పచ్చళ్లు, చిప్స్, చిన్న పిల్లలు తినే పొట్లాలు అనుమతులు లేకుండానే తయారు చేస్తున్నారు.