చిన్న హోటళ్లే కాదు పేరొందిన రెస్టారెంట్లలోనూ కల్తీ దందా కలకలం సృష్టిస్తోంది. పలు రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు నిబంధనలు పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా దందా కొనసాగిస్తున్నారు. వంట గదుల్లో పరిశుభ్రత పాటించడం లేదు. ఆహారం తయారీలో ప్రతిదీ కల్తీ వస్తువే వాడుతున్నారు. కల్తీ ఆహార ఉత్పత్తులు, కాలం చెల్లిన మసాలాలు వినియోగం తెలుగు రాష్ట్రాల్లోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోను ఇదే పరిస్థితి కనిపిస్తోంది.