రేపు పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

55చూసినవారు
రేపు పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
తమిళనాడులో నూతనంగా నిర్మించిన పంబన్ బ్రిడ్జిని 6వ తేదీన (ఆదివారం) ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రామేశ్వ‌రం-తాంబ‌రం మ‌ధ్య రాకపోకలు సాగించే విధంగా సముద్రంలో ఈ వంతెనను నిర్మించారు. బ్రిటిష్ హయాంలో నిర్మించిన వంతెన మరమ్మతులకు గురి కావడంతో దాని స్థానంలో కేంద్రం నూతన వంతెనను నిర్మించింది. వంతెన నిర్మాణం ఇటీవల పూర్తి కావడంతో ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపు ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్