ఆహార పదార్థాలు విక్రయించే రెస్టారెంట్లకు, భోజన హోటలకు, దాబాలకు, కర్రీ పాయింట్లకు రిజిస్ట్రేషన్‌తో పాటు, ఆహార భద్రత అధికారి నుంచి లైసెన్స్ పొందాలి. అధికారులు దాడుల్లో ఆహార విక్రయ కేంద్రాల్లో అనుమతులు లేకపోతే ముందుగా నోటీసులను జారీ చేయాలి. ఆ తర్వాత కూడా అదే తీరు కొనసాగితే ఆ కేంద్రాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించాలి. అంతేకాకుండా ఏడాదికొకసారి నిర్ణీత సంఖ్యలో నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించాలి.