ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం, నాసిరకం ఆహారం అని తేలితే జాయింట్ కలెక్టర్ వద్ద నేరస్తుడిని ప్రవేశపెట్టి జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. ఈ కేసుల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 లక్షల వరకూ జరిమానా చెల్లించి నేరస్తులు బయటపడుతున్నారు. ఒకవేళ కల్తీ ఆహారం తిని ఎవరైనా చనిపోయినట్లు నిరూపించగలిగితే గరిష్టంగా ఏడేండ్ల శిక్ష విధించేందుకు చట్టంలో సెక్షన్లున్నాయి. అయితే, కేసులు నిరూపితమై శిక్షలు పడ్డ ఘటనలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.