TG: హైదరాబాద్ దుర్గానగర్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.