యంగ్ హీరో నాని సమర్పణలో వచ్చిన మూవీ కోర్టు. ఈ మూవీ ఇటీవల రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శివాజీ, ప్రియదర్శి, డైరెక్టర్ రామ్ జగదీశ్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో మంగపతి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని, కోర్టు ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ అని పేర్కొన్నారు. ఇక నుంచి ఇలాంటి వైవిధ్యభరితమైన పాత్రలే చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.