చక్కటి పోషకాలుండే విభిన్న ఆహార పదార్థాలను మీ మెనూలో చేర్చుకోండి. రోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తీసుకోవడం తప్పనిసరి. సీజనల్ పండ్లు, కూరగాయలను ఎంచుకోండి. కెఫిన్ తీసుకోవడాన్ని పరిమితం చేసుకోండి. శరీరానికి అధిక మోతాదులో పోషకాలు అందేలా చూడండి. అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వులతో కూడిన లీన్ మీట్‌ను వినియోగించండి. ఉప్పు, చక్కెర వాడకం తగ్గించండి. మీ ఆహారాన్ని లవంగాలు, దాల్చిని చెక్క, మిరియాల వంటి సుగంధ ద్రవ్యాలతో రుచికరంగా తయారు చేసుకోండి.