శునక జాతులను నిషేధించడంపై హైకోర్టు కీలక నిర్ణయం

60చూసినవారు
శునక జాతులను నిషేధించడంపై హైకోర్టు కీలక నిర్ణయం
కొన్ని శునక జాతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టేసింది. శునక జాతులపై నిషేధం విధించే ముందు సదరు శునకాల ఓనర్లతోపాటు అందుకు సంబంధించిన సంస్థల నిర్వాహకులను సంప్రదించి.. ఆ తర్వాత ఈ నిషేధం విధించారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పెంపుడు జంతువులు ఎవరినైనా గాయపరిచినా.. అందుకు బాధ్యత వహించాల్సింది వాటి యజమానులేనని.. వారికి నగదు చెల్లించాల్సి ఉందని ఈ సందర్బంగా హైకోర్టు స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :