భాషను ఓ మతానికి ఆపాదించడం సరికాదు: సుప్రీంకోర్టు

54చూసినవారు
భాషను ఓ మతానికి ఆపాదించడం సరికాదు: సుప్రీంకోర్టు
ఉర్దూ భాషను ఓ మతానికి ఆపాదించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. మ‌హారాష్ట్ర‌లోని ఓ మున్సిప‌ల్ కౌన్సిల్‌కు ఉర్దూ భాష‌లో రాసిన సైన్ బోర్డు ఉండ‌డంపై సంజ‌య్ బ‌గ‌డే అనే వ్య‌క్తి పిటిషన్ దాఖలు చేశారు. సైన్ బోర్డుపై ఉర్దూ భాషను తొలగించి మరాఠీ భాషను ఉపయోగించాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. విచారించిన కోర్టు ఉర్దూ భాషను ఓ మతానికి ఆపాదించడం సరికాదని, మరాఠీతో పాటు ఉర్దూకు కూడా రాజ్యాంగ హోదా ఉందని పిటిషన్‌ను తిరస్కరించింది.

సంబంధిత పోస్ట్