భారతీయ వంటకాలకు కొత్తిమీరతో వీడదీయలేని బంధం ఉంది. దాదాపు అన్ని రకాల కూరల్లో కొత్తిమీర లేదా ధనియాల పొడి ఉపయోగిస్తుంటారు. అందుకే మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. ఇక కొత్తిమీర సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి. కానీ నీరు అధికంగా నిల్వ ఉండే నేలలు పంటపై ప్రభావం చూపిస్తాయి. ఒక ఎకరం పొలానికి 3-4 కిలోల విత్తనం అవసరం అవుతుంది. కొత్తిమీర కోసమైతే 40-50 రోజులు, ధనియాల కోసమైతే 80-110 రోజుల్లో కొతకు వస్తుంది.