కంది పంట సాగు విధానం

77చూసినవారు
కంది పంట సాగు విధానం
కంది పంట అన్ని రకాలైన నేలలకు అనువైన పంట. రైతులు విత్తనానికి ముందు నేల వదులుగా అయ్యేలాగా 2-3 సార్లు దమ్ము చేసుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 2-4 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం వేసుకొని చివరి దమ్ము చేసి విత్తనానికి సిద్ధం చేసుకోవాలి. ఎకరానికి 2 కిలోల విత్తనాలు పడుతాయి. మొక్కల మధ్య దూరం 20-25 సెంటి మీటర్లు, సాలుల మధ్య దూరం 90-120 సె. మీ. దూరాలు పాటిస్తూ విత్తనాలను విత్తుకోవాలి.

ట్యాగ్స్ :