కొంచెం తాగినా ప్రమాదమేనా?

58చూసినవారు
కొంచెం తాగినా ప్రమాదమేనా?
కొంచెం తాగుతున్నారా, అప్పుడప్పుడూ తాగుతున్నారా. అన్నది విషయం కాదు. మద్యానికి ఎవరి శరీరం ఎలా స్పందిస్తుందో తెలియదు. అందుకే తాగకుండా ఉండడానికే ప్రాధాన్యమివ్వమంటున్నారు డాక్టర్లు. గతంలో 60 ఏళ్లు దాటినవారిలో కన్పించే క్యాన్సర్లూ ఇతర ఆరోగ్య సమస్యలూ ఇప్పుడు ముప్ఫైల్లోనే కన్పించడానికి కారణం అదేనట. పాశ్చాత్య దేశాలకన్నా తక్కువ మోతాదులోనే మద్యం తీసుకున్నా మనదేశంలో క్యాన్సర్ల బారినపడే వారి సంఖ్య ఎక్కువ. మద్యం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పన్నమై మన డీఎన్‌ఏపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయట.

సంబంధిత పోస్ట్