చెరకుతోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన పనులు

62చూసినవారు
చెరకుతోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన పనులు
చెరుకు 12 నెలల పాటు కొనసాగే దీర్ఘకాలపు పంట. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరుకు తోటలు 6-8 నెలల దశలో ఉన్నాయి. ఈ దశలో భారీవర్షాలు, ఈదురుగాలుల నుంచి పంటను కాపాడుకునేందుకు జడచుట్లు వేసుకోవాలి. జడచుట్టు వేసేటప్పుడు భూమిలో తగినంత పదును లేకపోతే గడలు విరిగిపోతాయి. మొవ్వులోని 8 పచ్చని ఆకులను వదిలి, మిగిలిన ఆకులను విరిచి జడచుట్టు వేయాలి. పంట పెరిగేకొద్దీ 2-3 వరుసల్లో జడచుట్లు వేయవచ్చు.

ట్యాగ్స్ :