TG: సైబర్ నేరగాళ్లు నయా దందాకు తెరలేపారు. ఈ దందా కోసం శుక్రవారం ఏకంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్ చేసి ప్రజలను భయపెట్టారు. దీనిపై తాజాగా సీపీ ఆనంద్ స్పందించారు. తన ఫోటో డీపీగా ఉన్న నెంబర్ నుంచి కాల్స్ వస్తే స్పందించవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఏవైనా అనుమానాలు ఉంటే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి పోలీసులను సంప్రదించాలని కోరారు.