AP: ఏపీలో మరో 4 రూట్లలో సీ ప్లేన్ నడిపేందుకు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీశైలంలో శనివారం సీఎం చంద్రబాబు సీ ప్లేన్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. మరో 3-4 నెల్లలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం ఉంటుందని చెప్పారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు సీ ప్లేన్ లో ప్రయాణించి శ్రీశైలం చేరుకోనున్నారు.