అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేఎమ్ఎమ్ నేత హేమంత్ సోరెన్ వ్యక్తిగత సలహాదారు సునీల్ శ్రీవాత్సవపై ఆదాయ పన్ను శాఖ టార్గెట్ చేసింది. రాంచీలోని అశోక్ నగర్లో గల ఆయన ఇంటిపై ఐటీ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. దాంతో పాటు రాంచీ, జంషెడ్పూర్లో దాదాపు తొమ్మిది చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.