దేశంలో సైబర్ నేరగాళ్లు తాజాగా స్క్రాచ్ కార్డ్ స్కామ్ కు తెరలేపారు. స్కామర్లు వివిధ ప్రాంతాలకు కొరియర్ సర్వీస్ ద్వారా స్క్రాచ్ కార్డ్‌ను పంపిస్తున్నారు. ఆ కార్డులను స్క్రాచ్ చేస్తే భారీగా నగదు గెలుచుకున్నట్లు చూపిస్తుంది. ఆ డబ్బును పొందేందుకు అక్కడ ఉన్న నంబర్ కు ఫోన్ చేసి, సూచనలు పాటించాలని రాసి ఉంటుంది. ఈ సమాచారాన్ని విశ్వసిస్తూ బాధితులు తమ అకౌంట్, ఆధార్ వివరాలు చెప్పడంతో తిరువనంతపురంలో ఓ మహిళ రూ.23 లక్షలు, బెంగళూరులో మరో మహిళ రూ.15.51 లక్షలు పోగొట్టుకున్నారు.