'నాన్నా.. నాకు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుంది': శిఖర్ ధావన్ (వీడియో)

78చూసినవారు
టీంఇండియా ప్లేయర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులను నవ్విస్తుంటారు. తాజాగా తన తండ్రి మహేంద్ర పాల్ తో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. మహేంద్ర పాల్ దగ్గరికి వెళ్లిన ధావన్.. 'నాన్నా.. నాకు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుంది' అని అంటాడు. అయితే 'తొలిసారి పెళ్లి చేసినప్పుడే.. నీకు హెల్మెట్ పెట్టి చేశాం' అంటూ(మళ్లీ పిల్లను ఎవరిస్తారు అనే అర్థంలో) కౌంటర్ ఇస్తాడు మహేంద్రపాల్. ఈ రీల్ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్