తిరుమల వైకుంఠ టోకన్ల పంపిణీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. చనిపోయిన వారికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించమని, రెవెన్యూ అధికారి సమక్షంలోనే స్వస్థలాలకు మృతదేహాలు తరలించామని తెలిపారు. ఒకవైపు తెరవాల్సిన గేట్లు మరోవైపు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని, టోకెన్లు ఇస్తున్నారన్న ఆతృతతో అందరూ ఒక్కసారిగా గేట్లు మీద పడ్డారని వెల్లడించారు.