హీరోల కొడుకులు హీరోలు కావడం సినీ ఇండస్ట్రీలలో కనిపిస్తుంది. అయితే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. ఈ మేరకు తెలుగు సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ లో తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా కన్పించనున్నట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి.