షర్మిల, విజయమ్మపై YS జగన్ కేసు పెట్టడంపై హోం మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'సీఎం అవ్వడం కోసం సొంత బాబాయినే చంపించిన వాడు తల్లి, చెల్లి పై కేసులు పెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఏదో రోజు తల్లి, చెల్లిపై కేసులు పెడతాడని అనుకున్నాం.. అనుకున్నట్లే జరిగింది. జగన్‌కి తల్లి, చెల్లిపై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అందరికి అర్థమైంది. వైసీపీ నాయకులు జగన్ గురించి ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటున్నారు' అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.