దేశంలో యూరియా త్వరాత అత్యధికంగా రైతులు వినియోగించే డై-అమ్మోనియం పాస్ఫేట్ (DAP) ధర జనవరి నుంచి పెరగనుంది. 50 కేజీల బ్యాగ్ కనీసం రూ.200 ధర పెరుగుతుందని తెలిసింది. డీఏపీ ఎగుమతులపై కేంద్రం ఇప్పటివరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు నేటి (డిసెంబర్)తో ముగియనుంది. రాయితీ పొడిగింపుపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.