బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. బహదుర్గంజ్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన బల్లి కనిపించింది. భోజనాన్ని సరఫరా చేస్తున్న జన జాగృతి ఏజెన్సీపై అధికారులకు పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గత నెలలో కూడా ఇదే తరహా ఘటన జరిగిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో పిల్లలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.