CM రేవంత్ పై పరువు నష్టం దావా.. విచారణ వాయిదా

68చూసినవారు
CM రేవంత్ పై పరువు నష్టం దావా.. విచారణ వాయిదా
సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు గురువారం విచారణ చేపట్టింది. రేవంత్ రెడ్డిపై బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై తప్పుడు ప్రచారం చేశారని కాసం వేసిన పిటిషన్ పై కోర్టు విచారించింది. కేసు విచారణను వచ్చే నెల 11కు న్యాయస్థానం వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్