అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరో మూడు నెలలు ఆలస్యంకానుంది. నిజానికి 2025 జూన్ కల్లా పూర్తి కావాల్సి ఉంది. కూలీల కొరత, శిలలను మార్చే పనుల కారణంగా నిర్మాణం మూడు నెలలు ఆలస్యమయ్యేలా ఉందని నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా పేర్కొన్నారు. దాదాపు 200 మంది కూలీల కొరత ఉండటంతో 2025 సెప్టెంబర్ కల్లా పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.