కంది పంటను సాగు చేసిన రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రతిరోజూ కంది పైరును పరిశీలించి, చీడపీడలు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చపురుగు, లద్దెపురుగు, పేనుబంక వంటి తెగ్గుళ్ల నివారణకు ప్లూబెండాఅమైడ్ అనే రసాయనాన్ని ఎకరానికి 100ఎంఎల్ వేసుకోవాలి. లేదా ఇమామెస్టిన్ బెంజోఎట్ అనే మందును 100ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి. పేనుబంక నివారణకు ఇమ్డాక్లోపెడ్‌ను పిచికారీ చేయాలి.