పంజాబ్‌లోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ దొంగ బైకుపై వచ్చి మహిళ చేతిలో ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే సదరు మహిళ వెంటనే బ్యాగును గట్టిగా పట్టుకోవడంతో బైకర్ ఆమెను దాదాపు 20 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.