గత ఏడాది చిన్నసినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘బలగం’. కమెడియన్ వేణు ఎల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అనంతరం దర్శకుడు వేణు తర్వాతి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ అని తెలియజేశారు. ఓ మూవీ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. వేణును ఎల్లమ్మ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అడిగితే మీ ఇష్టం సార్ అంటాడు. దీంతో ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దామని దిల్ రాజు అంటాడు.