సుహాస్ కీలక పాత్రలో రామ్ గోధల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయిక. ఈ చిత్రంలో దర్శకుడు హరీష్ శంకర్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. నిర్మాత మాట్లాడుతూ 'సుహాస్ కెరీర్‌కు మైలురాయిగా నిలిచే చిత్రమిది. సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతో పాటు అంతకు మించిన ఫన్ ఉంటుంది. హరీష్ శంకర్ అడగ్గానే మా చిత్రంలో అతిథి పాత్రను చేసినందుకు కృతజ్ఞతలు' అన్నారు.