ఈ సమయంలో పొరపాటున కూడా రాఖీ కట్టొద్దు!

60చూసినవారు
ఈ సమయంలో పొరపాటున కూడా రాఖీ కట్టొద్దు!
అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు ప్రేమానురాగాలు పంచుకుంటూ కష్టసుఖాల్లో తోడుంటామని చెప్పుకునే పండగే రక్షాబంధన్. ప్రతి ఏడాది శ్రావణ మాసం పూర్ణిమ తిథి నాడు రక్షా బంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 19న వస్తుంది. కానీ జ్యోతిషం శాస్త్రం ప్రకారం.. ఆ రోజు ఉదయం 5.52 నుంచి మధ్యాహ్నం 1.32 వరకు భద్రకాలం ఉంది. ఈ సమయంలో రాఖీ కట్టడం శుభం కాదు. ఒకవేళ ఈ భద్రకాలంలో రాఖీ కడితే దోషమని పండితులు హెచ్చరిస్తున్నారు. భద్రకాలంలో రాఖీ కట్టారంటే ఆ ఏడాదంతా సోదరులకు కష్టాలు, సమస్యలు వస్తాయని ఒక విశ్వాసం ఉందని పండితులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్