చినాబ్ రైల్వే బ్రిడ్జ్ మీకివి తెలుసా?

77చూసినవారు
చినాబ్ రైల్వే బ్రిడ్జ్ మీకివి తెలుసా?
జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనపై ట్రయల్ రన్ పూర్తయింది. త్వరలోనే అందుబాటులోకి రానుంది. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనగా నిలుస్తోంది. సంగల్దాన్-రాంబన్ రైల్వే స్టేషన్ల మధ్య నిర్మించిన ఈ బ్లాస్ట్‌ఫ్రూఫ్ వంతెన 1315 మీటర్ల పొడవు ఉంటుంది. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.