'ఏప్రిల్ ఫూల్స్ డే' ఎలా మొదలైందో తెలుసా?

71చూసినవారు
'ఏప్రిల్ ఫూల్స్ డే' ఎలా మొదలైందో తెలుసా?
ఏప్రిల్ 1 అనగానే మొదట గుర్తొచ్చేది ఫూల్స్ డే. 1582లో జూలియన్ క్యాలెండర్ పోయి జార్జియన్ క్యాలెండర్ అనుసరణలోకి వచ్చింది. జార్జియన్ క్యాలెండర్లో జనవరి 1న ఏడాది ప్రారంభం కాగా.. జూలియన్ క్యాలెండర్లో ఏప్రిల్ 1గా ఉంది. దీంతో కొత్త క్యాలెండర్‌కు అలవాటు పడని వారు ఏప్రిల్ 1నే న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటే, వారిని 'ఏప్రిల్ ఫూల్స్' అని ఎగతాళి చేసేవారు. భారత్‌లో ఇది బ్రిటిష్ పాలనలో(19వ శతాబ్ధం) ప్రాచుర్యంలోకి వచ్చింది.