నల్ల ద్రాక్ష తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. గుండె జబ్బులు వంటివి నివారిస్తుంది. షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. ఈ పండ్లలో మెగ్నీషియం, గ్లూకోజ్, సిట్రిక్ యాసిడ్ లాంటి అనేక పోషకాలు ఉండి చాలా రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని నిపుణులు వెల్లడించారు.