ఉసిరికాయతో ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని భారతీయ ఆయుర్వేద ఔషధంలో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉసిరికాయలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడుతాయి.