’అందాల రాక్షసి‘ మూవీ హీరో నవీన్ చంద్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హీరోగా వరుస సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన నవీన్ ఆసక్తికర విషయాలు తెలిపారు. సినిమాలోకి రాక ముందు బళ్లారిలో డ్యాన్స్ టీచరుగా పనిచేసినట్లు చెప్పారు. ’’అప్పట్లో ఆర్కుట్ అనే సోషల్ మీడియాలో నా ఫోటోలు చూసి హను రాఘవపూడి పిలిచారు. అలా అందాల రాక్షసి అవకాశం ఇచ్చారు‘‘ అని తెలిపారు.