గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు

56చూసినవారు
గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు
తెలుగు రాష్ట్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టుగా జరుగుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి పలు స్కానింగ్‌ సెంటర్లు, ఆసుపత్రుల నిర్వాహకులు కడుపులో పెరుగుతోంది ఆడ బిడ్డో, మగ బిడ్డో ముందుగానే నిర్ధారిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా సెంటర్లను తనిఖీలు నిర్వహించాల్సిన సంబంధిత అధికారులు అడిగినంత ఇస్తే చాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్