లక్షల కోట్లతో పెళ్ళిళ్ళ పరిశ్రమ

59చూసినవారు
లక్షల కోట్లతో పెళ్ళిళ్ళ పరిశ్రమ
ప్రపంచంలో అతిపెద్ద వెడ్డింగ్ డెస్టినేషన్‌గా భారత్‌ ఉందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జెఫరీస్ వెల్లడించింది. పెళ్ళిళ్ళ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలలో చైనా తర్వాత భారత్‌నే రెండో స్థానంలో ఉంది. భారత పెళ్ళిళ్ళ పరిశ్రమ సుమారు రూ.10.8 లక్షల కోట్లతో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నట్లు జెఫరీస్ తన రిపోర్టులో పేర్కొంది. దేశంలో ఫుడ్, గ్రోసరీ మార్కెట్‌ తర్వాత వివాహ పరిశ్రమే ఉన్నట్లు ఈ రిపోర్టు తెలిపింది.

సంబంధిత పోస్ట్