మీ పేరు 'V'తో స్టార్ట్ అవుతుందా?

4038చూసినవారు
మీ పేరు 'V'తో స్టార్ట్ అవుతుందా?
పేరు 'V' తో మొదలయ్యే వారికి కలిసొచ్చే అంశాలేంటి, ఎదురయ్యే సవాళ్లు ఏంటి అనే విషయాలను న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

'V' అక్షరంతో పేరు మొదలయ్యేవారు గౌరవప్రదంగా జీవిస్తారు. ఇతరుల నుంచి గౌరవం కోరుకుంటారు. ఉన్నత స్థాయికి ఎదిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా తెలివిగా, నమ్మకంగా ఉంటారు. స్నేహితులను జాగ్రత్తగా చూసుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువ మందితో కలవరు. తక్కువ మందితోనే స్నేహం చేస్తారు. వీరు తమ కంటే తక్కువ తెలివి ఉన్న వ్యక్తులతో కలిసిపోవాలి. అది వీరికి మేలు చేస్తుంది. వీరు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. వీరు కొత్త విషయాలపై ప్రయోగాలు చేయడానికి రెడీగా ఉంటారు. రిస్క్ లు తీసుకోరు. వీరు జంతువులకు సహాయం, సేవ చేస్తే మంచిది.

వీరు పేదవారికి, పశువులకు ఆకుకూరలను దానంగా ఇస్తే మంచి జరుగుతుంది. బ్లూ, గ్రే (బూడిదరంగు) వీరికి అదృష్ట రంగులు. మంగళవారం, శుక్రవారం అదృష్టం కలిసొస్తుంది. 6 వీరి లక్కీ నంబర్.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్