ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ వీధికుక్క గంట వ్యవధిలో మహిళలు, పిల్లలు సహా 17 మందిపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ సీసీటీవీ ఫుటేజీలో 22 ఏళ్ల విద్యార్థి తన ఇంటి బయట ఫోన్‌లో మాట్లాడుతుండగా కుక్క దాడి చేయడం కనిపించింది. గోరఖ్‌పూర్ అదనపు మున్సిపల్ కమిషనర్ దుర్గేష్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తనకు తెలియదని, ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు.