బాలికపై కుక్క దాడి (వీడియో)

551చూసినవారు
యజమానులు అప్రమత్తంగా లేకుంటే పెంపుడు కుక్కలు ఇతరులను గాయపరుస్తున్నాయి. ఇదే కోవలో యూపీలోని ఘజియాబాద్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. అజ్నారా ఇంటిగ్రిటీ సొసైటీ అపార్ట్‌మెంట్‌ ఆవరణలో ఓ బాలిక ఆడుకుంటోంది. సైకిల్ తొక్కుతున్న బాలికపై జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన పెంపుడు కుక్క దాడి చేసింది. వెంటనే చిన్నారి తల్లి అప్రమత్తమైంది. కుక్క దాడి నుంచి తన కుమార్తెను కాపాడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :