ఎట్టకేలకు కదిలిన డాలి సరకు రవాణా నౌక!

60చూసినవారు
ఎట్టకేలకు కదిలిన డాలి సరకు రవాణా నౌక!
అమెరికాలోని బాల్టిమోర్ వంతెన కూలిపోవడానికి కారణమైన డాలి సరకు రవాణా నౌక అక్కడి నుంచి బయల్దేరింది. 16 నుంచి 18 గంటల ప్రయాణం అనంతరం ఆ నౌక వర్జీనియాలోని నార్‌ఫోల్క్‌కు చేరుకోనుంది. కాగా మార్చి 26న బాల్టిమోర్ పోర్ట్ నుంచి బయల్దేరిన నౌక కాసేపటికే పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో ఆ బ్రిడ్జి కుప్పకూలింది. ఆ నౌకలో ఎక్కువ మంది భారత సిబ్బందే ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్