పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి: సీఎం స్టాలిన్‌

69చూసినవారు
పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి: సీఎం స్టాలిన్‌
డీఎంకే నేత అన్బుదురై ఇంటి వివాహ కార్యక్రమం నగరంలో సోమవారం జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన సతీమణి దుర్గతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విప్లవ రచయిత పావేందర్‌ భారతిదాసన్‌ చెప్పినట్లు ఇంటికి దీపంగా, దేశానికి కార్యకర్తలుగా ఉండి సేవలు అందించాలని తెలిపారు. నూతన జంట తమకు పుట్టే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టాలని, తమిళ భాషకు వన్నె తీసుకురావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్