భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

355చూసినవారు
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 341 పాయింట్లు ఎగబాకి 65,059 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 19,292 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.91 వద్ద కొనసాగుతోంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్‌ మోటార్స్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్