తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. HYD-జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. భాగ్యనగరంలో మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. మార్చి నెలాఖరు కల్లా కొత్త కారిడార్ల DPRలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్ వరకు మెట్రో కారిడార్లకు ఏప్రిల్ నాటికి టెండర్లు పిలిచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.