చలికాలంలో పుదీనా టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం పుదీనా టీని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. పుదీనాలోని మెంథాల్ అనే పదార్థం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. పుదీనా టీ తలనొప్పి, మైగ్రేన్ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.