AP: తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఘటనపై ఇప్పటికే సీఎం న్యాయ విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా చూస్తాం. ఎలా జరిగింది అనేది విచారణలో తేలుతుంది. ఆ తర్వాతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని వెల్లడించారు.