కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ మహిళల కోసం అనేక ప్రకటనలు చేయవచ్చని సమాచారం. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం ఈ ఏడాది మార్చితో ముగుస్తుండటంతో.. పొడిగింపును ప్రకటించవచ్చని తెలుస్తోంది. అలాగే మహిళలపై పన్ను భారాన్ని తగ్గించడానికి కేంద్రం యోచన చేస్తోంది. దీంతో మహిళలపై పన్ను భారం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.