మధ్యప్రదేశ్‌లో ఆదివారం
భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2:33 గంటలకు సింగ్రౌలీలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదు అయినట్లు తెలిపింది.
భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. అదృష్టవశాత్తూ
భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడలేదు.